వచ్చే నెల నుండి రామ్ కొత్త సినిమా

Tuesday,November 20,2018 - 01:03 by Z_CLU

నెక్స్ట్ సినిమా ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. రీసెంట్ గా ‘హలో గురూ ప్రేమ కోసమే’ తో రెగ్యులర్ స్టైల్ లో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసిన రామ్, వచ్చే నెల నుండి మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సెట్స్ పైకి రానున్నాడు.

ప్రస్తుతానికి లవర్ బాయ్ ఇమేజ్ తో సక్సెస్ ఫుల్ గా కరియర్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ ని, ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేయనున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. జస్ట్ లుక్స్ కే సోషల్ మీడియాలో ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే, రాను రాను సినిమాపై మరిన్ని వైబ్స్ క్రియేట్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ సరసన నటించే హీరోయిన్ దగ్గరి నుండి తక్కిన టెక్నీషియన్స్  డీటేల్స్ వరకు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీ లైన్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ, ఈ సినిమాని పూరి టూరింగ్ టాకీస్ తో పాటు స్రవంతి రవి కిషోర్ బ్యానర్స్ పై నిర్మించనున్నట్టు తెలుస్తుంది.