మాళవిక నాయర్ ఇంటర్వ్యూ

Tuesday,November 20,2018 - 04:16 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ లో కీ రోల్ ప్లే చేసింది మాళవిక నాయర్. సినిమా రిలీజయ్యేంత వరకు ఈ క్యారెక్టర్ డీటేల్స్ కూడా బయటికి రానివ్వకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేశారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ‘శిశిర’ గా  మెస్మరైజ్ చేసిన మాళవిక, సినిమాలో మోస్ట్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ అనిపించుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది మాళవిక.. అవి మీకోసం…

అద్భుతమనిపిస్తుంది…

ఇప్పటికీ 2 సార్లు చూశాను సినిమాని థియేటర్ లో… అద్భుతమనిపిస్తుంది రెస్పాన్స్ చూస్తుంటే…

ఇంక నమ్మకం వచ్చేసింది…

వచ్చిన ప్రతి సినిమాని ఒప్పుకోవడం లేదు. బెస్ట్ అనిపించిందే చేస్తున్నాను. మనకు బెస్ట్ అనిపించిందే అందరికీ నచ్చితే, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. రాహుల్ ఈ స్టోరీ చెప్పినప్పుడు నేనెలా ఫీల్ అయ్యానో, సినిమా చూసినవాళ్ళు  కూడా అలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫుల్ హ్యాప్పీ.

మెయిన్ రీజన్…

నేను సినిమాలో ఎంత సేపు కనిపిస్తాను  అనే దానికన్నా, నేను ప్లే చేసిన  క్యారెక్టర్ స్టోరీలో ఎంత ఇంపార్టెంట్ అన్నదే చూసుకుంటాను. ‘టాక్సీవాలా’ సినిమాకి సోల్ శిశిర క్యారెక్టర్. అందుకే ఈ సినిమా చేశాను. మంచి సినిమాలో చిన్న పార్ట్ అయినా చాలు. సినిమా అంతా ఉండాలని రూల్ లేదు.

నాకా భయం లేదు…

‘మహానటి’ లో కూడా నేను చేసింది చాలా చిన్న రోల్. ఇప్పుడు ‘టాక్సీవాలా’ లో కూడా నాది ఫీమేల్ లీడ్ కాదు. ఇలా చేయడం వల్ల జస్ట్ కామియో రోల్స్ కే పరిమితం అవుతానేమో అనే భయం నాకు లేదు. నేనుకున్నది ఒకటే..  మంచి సినిమాలో పార్ట్ అవ్వాలి. అంతే…

రెండే చూస్తా…

ఏ క్యారెక్టర్ ఓకె చేసే ముందైనా రెండు విషయాలు ఆలోచిస్తా.. మొదటిది నేను చేసేది చాలెంజింగ్ గా ఉండాలి. అలా లేకపోతే కనీసం సినిమా చూసిన ఆడియెన్స్ కి ఆ క్యారెక్టర్ కొన్నాళ్ళైనా గుర్తుండిపోవాలి. ‘టాక్సీవాలా’ చూసిన ప్రతి ఒక్కరు ‘శిశిర’ కి కనెక్ట్ అవుతున్నారు ఇంకేం కావాలి…

నేను పర్ఫెక్షనిస్ట్…

నాకు స్క్రిప్ట్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. నేను డైరెక్టర్ అవ్వగలనో లేదో నాకైతే తెలీదు. దానికి చాలా ఓపిక కావాలి. నేను చాలా పర్ఫెక్షనిస్ట్. ఫ్యూచర్ లో డెఫ్ఫినెట్ గా స్టోరీస్ రాస్తాను.

విజయ్ దేవరకొండ…

నేను చేసిన 5 సినిమాల్లోనూ 3 సినిమాల్లో విజయ్ ఉన్నాడు. నాకు పర్సనల్ గా చాలా క్లోజ్. ఈ మధ్య ఎంత నెగెటివిటీ ఫేస్ చేస్తున్నా, చాలా పాజిటివ్ గా ఉంటాడు.

 

చాలా మారాను…

నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు జస్ట్ పద్నాలుగేళ్ళు. ఇప్పుడు 20. అంటే ఈ ఆరేళ్ళలో చాలా మారాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది.

తమిళ సినిమా…

తమిళంలో రీసెంట్ గా ఒక సినిమా సంతకం చేశాను. వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తారు.