నరేష్ ఇంటర్వ్యూ

Tuesday,June 19,2018 - 04:01 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘సమ్మోహనం’ రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన నరేష్, ఈ సినిమా గురించి మీడియాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీ కోసం…

అందరి చూపు మనవైపే…

ఛలో, తొలిప్రేమ, రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి, సమ్మోహనం.. వరస హిట్లు… ఇండియన్ సినిమా హిస్టరీ లోనే గర్వకారణం.. అందరి చూపు మనవైపే.

అందుకే సినిమా ఆడింది…

ఇప్పటి వరకు సినిమా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాలు ఏవీ ఆడలేదు. కానీ ‘సమ్మోహనం’ సినిమా కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తెరకెక్కింది. అందుకే ఈ సినిమా హిట్టయింది.

 

అంత కష్టపడ్డాం

క్లైమాక్స్ సీన్ కోసం 2 రోజులు కష్టపడ్డాం… రెండో రోజు వర్క్ షాప్ చేసినప్పుడు కంప్లీట్ గా అలసిపోయి బయటికి వచ్చి ఒకరినొకరు కౌగిలించుకున్నాం… అంతలా కష్టపడ్డాం ఆ సీన్ కోసం… ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది.

సుధీర్ బాబును రీప్లేస్ చేయలేం

చాలా అద్భుతంగా నటించాడు సుధీర్ బాబు.. అసలు తన ప్లేస్ లో ఇంకొకరిని ఇమాజిన్ కూడా చేసుకోలేం.. ఆ క్యారెక్టర్ లో. ఇంటర్వెల్ సీన్ తో పాటు క్లైమాక్స్ సీన్ లో సుధీర్ బాబు పర్ఫామెన్స్ సినిమాకు పెద్ద ప్లస్.

అదితి రావు హైదరి

సినిమా బిగినింగ్ లో తెలుగు అస్సలు రాని అమ్మాయిలా, ఆ తరవాత తెలుగు వచ్చీ రాని అమ్మాయిలా అద్భుతంగా నటించింది. ఎమోషన్ సీన్స్ లో అదితి పర్ఫామెన్స్ హైలెట్.

అదే నిజమైన అవార్డు

ఒక సినిమా చూసి ప్రేక్షకులు ఆదరిస్తే అదే చాలా పెద్ద అవార్డు.

 

అద్భుతమైన నటులున్నారు

మన ఇండస్ట్రీలో అద్భుతమైన నటులున్నారు.. ప్రకాష్ రాజ్, రావు రమేష్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటులున్నారు.. అందరికీ అవకాశాలు వస్తున్నాయి.

ఫస్ట్ బైక్ జంప్…

నేనెప్పుడూ ఎక్స్ పెరిమెంట్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. టాలీవుడ్ లో ఫస్ట్ బైక్ జంప్ చేసింది నేనే…

ఒక్క సీన్…

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఒక్క అద్భుతమైన సీన్ అయినా ఉంటుంది అని నాకనిపిస్తే ఏ సినిమా అయినా నేను చేయడానికి సిద్ధం.