నాని-పూరి కాంబోలో సినిమా.. నిజమెంత?

Tuesday,June 19,2018 - 02:12 by Z_CLU

ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేయడం నాని స్టయిల్. ఇందులో భాగంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే సినిమా ఎనౌన్స్ చేశాడు. మరి రెండో సినిమా ఏంటి? సరిగ్గా ఇక్కడే పుకార్లు స్టార్ట్ అయ్యాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడనేది ఆ గాసిప్.

2 రోజులుగా రౌండ్స్ కొడుతున్న ఈ పుకారుపై క్లారిటీ ఇచ్చాడు నేచురల్ స్టార్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తను సినిమా చేయడం లేదని ప్రకటించాడు. నిజానికి నాని-పూరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. కాకపోతే ప్రస్తుతానికి పూరి డైరక్షన్ లో తను మూవీ చేయడం లేదని స్పష్టంచేశాడు నాని.

కృష్ణార్జున యుద్ధం రిజల్ట్ తర్వాత అప్ కమింగ్ మూవీస్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు నాని. అందుకే ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి, విక్రమ్ కుమార్ లాంటి దర్శకుల్ని కూడా కాదని.. గౌతమ్ తిన్ననూరికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత అవసరాల లేదా హను కు ఛాన్స్ ఇవ్వొచ్చు. పూరితో మాత్రం ఇప్పట్లో సినిమా ఉండదు.