ఎంసీఏ మూవీ అప్ డేట్స్

Friday,December 08,2017 - 10:39 by Z_CLU

నాని, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఎంసీఏ. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. యూరోప్ లో మూవీకి సంబంధించి 2 పాటలు పూర్తిచేయడంతో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈనెల 21న ఎంసీఏను థియేటర్లలోకి తీసుకురానున్నారు.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది ఎంసీఏ. వదిన, మరిది మధ్య అనుబంధం, ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూవీ మొత్తం వరంగల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంటే.. ఈ సినిమాలో సాయిపల్లవి మరోసారి తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతోందన్నమాట. కానీ ఆమె మాటల్లో మాత్రం తెలంగాణ యాస ఉండదని స్పష్టంచేశాడు దిల్ రాజు.

ఇక సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలకాగా.. అన్ని పాటలతో జ్యూక్ బాక్స్ ను సోమవారం విడుదల చేయబోతున్నారు. అదే రోజు ఎంసీఏ థియేట్రికల్ ట్రయిలర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక సినిమా విడుదలకు 4 రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు.