మరికొన్ని గంటల్లో ఎంసీఏ సాంగ్ రిలీజ్

Saturday,December 09,2017 - 09:47 by Z_CLU

సోమవారం నుంచి ఎంసీఏ సాంగ్స్ అన్నీ యూట్యూబ్ లో ఉంటాయని ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు. అయితే అంతకంటే ముందే ఓ సింగిల్ ను విడుదల చేయాలని నిర్ణయించాడు. ఈరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఎంసీఏ సినిమా నుంచి “ఏమైందో తెలియదు నాకు” అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

ఎంసీఏ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. గతంలో నాని, దేవిశ్రీ కాంబోలో వచ్చిన నేను లోకల్ సినిమాలో సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. సో.. ఎంసీఏ సాంగ్స్ కూడా బాగుంటాయని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఎంసీఏ సినిమాలో నాని సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. నానికి వదినగా ఒకప్పటి హీరోయిన్ భూమిక కనిపించనుంది. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకుడు.