నాని ‘నిన్నుకోరి’ షూటింగ్ కంప్లీట్

Thursday,May 11,2017 - 01:16 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న నాని మరో సినిమా కంప్లీట్ చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న నిన్ను కోరి సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు నాని. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఆఫీషియల్ డేట్స్ ఎనౌన్స్ చేయబోతున్నారు.

నిన్ను కోరి సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ డైరక్టర్. ఈ సినిమా పాటల్ని త్వరలోనే సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టి రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.

నిన్నుకోరి సినిమా కంప్లీట్ అయిపోవడంతో, త్వరలోనే ఎంసీఏ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు నాని. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నిన్ను కోరి, ఎంసీఏ సినిమాలు రెండూ ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతాయి. నేను లోకల్ తో కలుపుకుంటే.. ఈ ఏడాది నాని సినిమాల కౌంట్ 3.