సూపర్ స్పీడ్ లో నాని సినిమా

Friday,August 18,2017 - 04:51 by Z_CLU

నాని M.C.A. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ని రిజిస్టర్ చేస్తున్న నాని ఈ సినిమా తన కరియర్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

 

బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అప్పుడే 50% షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసింది. భూమిక కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి జోడీ కట్టనుంది. ఏ మాత్రం డిలేస్ కి చాన్స్ లేకుండా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, డిసెంబర్ 21 నుండి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకి రాక్ స్టార్ DSP మ్యూజిక్ కంపోజర్.