మరికొన్ని గంటల్లో ఎంసీఏ హంగామా

Monday,November 20,2017 - 11:54 by Z_CLU

ఫస్ట్ లుక్ టీజర్ తో ఇప్పటికే హల్ చల్ చేసింది ఎంసీఏ సినిమా. ఆ టీజర్ లో ఎంసీఏ అంటే ఏంటో, తాన మైండ్ సెట్ ఏంటో క్లియర్ గా చెప్పేశాడు హీరో నాని. ఇప్పుడు పాటలతో హల్ చల్ చేయబోతున్నాడు. అవును.. ఇవాళ్టి నుంచి ఎంసీఏ పాటలు దశలవారీగా విడుదలకాబోతున్నాయి. ఇందులో భాగంగా టైటిల్ సాంగ్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో నానికిది రెండో సినిమా. ఇంతకుముందు ఇదే బ్యానర్ లో నాని చేసిన నేను లోకల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సో.. వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న ఎంసీఏ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. దీనికి తోడు ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండడంతో ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శరవేగంగా ముస్తాబవుతోంది ఎంసీఏ సినిమా. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.