సుమంత్ ఇంటర్వ్యూ

Friday,December 08,2017 - 09:06 by Z_CLU

గతేడాది  ‘నరుడా డోనరుడా’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన సుమంత్ ‘మళ్ళీ రావా’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే విడుదల అవుతుంది. ఈ సందర్భంగా సుమంత్ మీడియాతో ముచ్చటించాడు.. ఆ విశేషాలు సుమంత్ మాటల్లోనే..

స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది

‘మళ్ళీ రావా’ ఓ రొమాంటిక్ డ్రామా… కార్తీక్ – అంజలి మధ్య జరిగిన కథతో తెరకెక్కిన సినిమా ఇది. చిన్నతనంలో ఇన్నోసెన్స్ తో కలుస్తారు.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్లిద్దరు కలిసారా..లేదా అనేది మెయిన్ స్టోరీ. కథ వినడానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

గోదావరి తర్వాత ఇదే…

నేను నటించిన సినిమాల్లో రొమాంటిక్ డ్రామా అంటే గోదావరి, మధు మాసం సినిమాలే గుర్తొస్తాయి. సత్యం కూడా లవ్ ఎంటర్టైనర్ అయినప్పటికీ అందులో కొన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. నిజానికి గోదావరి సినిమాతో కూడా ఈ సినిమాను పోల్చలేం కానీ ఆ సినిమా మళ్ళీ నేను నటించిన నేచురల్ లవ్ స్టోరీ మాత్రం ఇదే.

సరిగ్గా అదే టైంలో

లాస్ట్ సినిమా కొంచెం డిస్సప్పాయింట్ చేశాక ఒక కమర్షియల్ ఎలెమెంట్స్ కి దూరంగా నేచురల్ రొమాంటిక్ డ్రామా చేయాలనీ వెయిట్ చేస్తే బాగుంటుందనిపించింది. సరిగ్గా అదే టైంలో గౌతమ్ నాకు ఈ స్క్రిప్ట్ వినిపించాడు. సో హ్యాపీ గా ఫీలయ్యి వెంటనే స్టార్ట్ చేసేశా. ఈ సినిమా తర్వాత ఓ డార్క్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నా.


వర్కౌట్ అవ్వవు

ఈ సినిమాలో నేను కార్తీక్ అనే రోల్ ప్లే చేశాను. చాలా చేయాలనుకుంటుంటాడు కానీ ఏది వర్కౌట్ అవ్వని క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు బాగా ఆప్ట్ అనిపించిన రోల్ ఇది. ప్రొఫెషన్ విషయానికొస్తే కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. ఆటిట్యూడ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తాడు.

ఆ మెంటాలిటీ కాదు

డబ్బు కోసం సినిమాలు చేయను.. అది నాకు అస్సలు నచ్చదు. నేను సినిమాలు చేసేది కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. 17 సంవత్సరాల్లో 22 సినిమాల్లో నటించాను. మధ్యలో ఓ సంవత్సరం గ్యాప్ తీసుకున్నప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేచురల్ గా రియలిస్టిక్ గా ఉండే స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాను. ఏదో డబ్బు కోసం ఎక్కువ సినిమాలు చేయాలి.. అనే మెంటాలిటీ కాదు నాది. సో అందుకే టైం తీసుకున్నప్పటికీ ఏదో ఒక కొత్త రకం సినిమా చేయాలనీ ట్రై చేస్తున్నా.

నాకొక్కడికే కాదు…

నేను రీసెంట్ గా చేసిన విక్కీ డోనర్ సినిమా ఇక్కడ ఆడకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకో ఆ సినిమా మన నేటివిటీ కి కనెక్ట్ అవ్వలేదనుకుంటున్నా. నిజానికి నాకొక్కడికే కాదు చాలా మంది హీరోలల పై కూడా రీమేక్ ఎఫెక్స్ట్ పడింది. అప్పట్లో నాని చేసిన ఓ రీమేక్ సినిమా అలాగే వెంకటేష్ గారు రామ్ చేసిన సినిమాలు ఇలా చాలా సినిమాలు అక్కడ సూపర్ హిట్స్ సాధించి ఇక్కడ యావరేజ్ బీలో యావరేజ్ లు గా మిగిలిపోయాయి. కొన్ని సార్లు ఎక్కడ నేటివిటీ మరియు కథలు ఇక్కడ వర్కౌట్ అవ్వవు. కొన్ని సినిమాలకు అలా జరుగుతుంటాయి. అందుకే ఇక నుంచి రీమేక్ విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాలని డిసైడ్ అయ్యాను.

రెండు నెలల్లోనే పూర్తి చేశాం

ఈ సినిమా చాలా సింపుల్ గా తక్కువ టైం లోనే ఫినిష్ చేసేశాం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడమే దీనికి రీజన్. ఆల్మోస్ట్ 9 నెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. అందుకే కేవలం రెండు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము. కానీ సినిమా చుట్టేశారు అనిపించకుండా ఉంటుంది.

వాళ్లెవరో తెలియకుండానే

ఈ సినిమా ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ లో చేశాను. నిజానికి సినిమా ఒప్పుకునే ముందు కూడా వాళ్లెవరో నాకు తెలియదు.. గౌతమ్ వల్లే వాళ్ళు పరిచయం అయ్యారు. ప్రొడక్షన్ లో నాకు కొంచెం అనుభవం ఉండటంతో రాహుల్ ఈ సినిమాకి నిర్మాతగా ఎంటర్ అయిన రోజే ప్రొడక్షన్ లో నా హెల్ప్ కావాలంటే అడగమని చెప్పాను. కానీ నా నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోకుండానే సినిమాను ఫినిష్ చేసేశారు.


నా ప్రమేయం లేదు.

నిజానికి ఈ సినిమా విషయానికొస్తే నటుడిగా తప్ప మిగతా వాటిలో ఎందులోనూ నా ప్రమేయం లేదు. కేవలం నటించా అంతే.. మిగతా దంతా గౌతమ్ రాహుల్ చూసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళిద్దరినీ చూసి చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. డైరెక్టర్ గా గౌతమ్ అన్నిటిలో పర్ఫెక్ట్.. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తన ప్లానింగ్ తో బెస్ట్ అనిపించుకున్నాడు.

కన్నీళ్ళొచ్చాయి…

నిజానికి ఎవరైనా స్క్రిప్ట్ చెప్తుంటే నాకు నచ్చకపోతే వొద్దండీ నచ్చలేదు అని .. టైం వేస్ట్ చేయొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తా. కానీ గౌతమ్ ఈ స్క్రిప్ట్ చెప్తుంటే అలా వింటూ ఉంది పోయా.. చివరికొచ్చేసరికీ కన్నీళ్ళొచ్చాయి. అంతలా నా మనసుని కదిలించిన సినిమా ఇది. సినిమా చూసాక అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుందనుకుంటున్నా.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 

ఈ సినిమా తర్వాత ఓ మూడు సినిమాలు సైన్ చేశా.. నెక్స్ట్ ఓ డార్క్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నా.. అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా సినిమాల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తా…