నాని చెప్పిన దాస్ సంగతులు

Tuesday,September 25,2018 - 12:53 by Z_CLU

సోషల్ మీడియాలో ‘దేవదాస్’ సీజన్ నడుస్తుందా అనిపిస్తుంది. అసలే మల్టీస్టారర్ దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్, సినిమాని మ్యాగ్జిమం రేంజ్ లో రీచ్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ సందర్భంగా సినిమాలో తన రోల్ గురించి మరింత క్లారిటీ ఇచ్చాడు నాని.

‘దాస్ ఒక ఇన్నోసెంట్ హానెస్ట్ డాక్టర్. అందరిలాగే నార్మల్ గా, రెగ్యులర్ మిడిల్ క్లాస్ లైఫ్ ని గడుపుతాడు. అంతలో తన లైఫ్ లోకి ఎవరూ లైఫ్ లో చూడని ఒక వ్యక్తి ఫ్రెండ్ గా వస్తే, అప్పుడా డాక్టర్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్, వాటికి ఆ డాక్టర్ ఎలా రియాక్టయ్యాడు అనేదే ఈ క్యారెక్టర్…’ అని చెప్పాడు నాని. నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించింది.

రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ‘దేవదాస్’ కి శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.