నాగార్జున చెప్పిన 'దేవా' సంగతులు

Tuesday,September 25,2018 - 12:05 by Z_CLU

దేవదాస్ సినిమా తన కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలుస్తుందంటున్నాడు నాగ్. చాన్నాళ్ల తర్వాత దేవ అనే డాన్ పాత్రలో నటించానని, అలా అని యాక్షన్ పెద్దగా ఉండదని అంటున్నాడు.

“మళ్ళీ డాన్ లా నటించా ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో సెటిల్ మెంట్స్ లాంటివి ఏమీ ఉండవు. దేవదాస్ సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్ షిప్ స్టోరీ”.

ఇలా సినిమాలో తన పాత్రకు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు నాగ్. డాన్ గా కనిపించే తనకు ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉందని చెప్పిన నాగ్, ఆ కథను కూడా బయటపెట్టాడు.

“సినిమాలో నాది మంచి లవ్ స్టోరీ. హీరోయిన్ న్యూస్ రీడర్. ఆ అమ్మాయిని కాలేజ్ డేస్ నుండి దేవా లవ్ చేస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పడు. అందరినీ బెదిరిస్తుంటాడు కానీ, ఆ అమ్మాయి వరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంటాడు. అప్పుడు నాని చొరవ తీసుకొని ఇద్దరినీ కలుపుతాడు.”

అలా సినిమాలో దేవా సమస్యను దాసు, దాస్ సమస్యను దేవా తీరుస్తారని, ఈ క్రమంలో ఫన్ జనరేట్ అవుతుందని అంటున్నాడు నాగ్. రెండున్నర గంటలు సరదాగా నవ్వుకోవాలంటే ఈ వీకెండ్ దేవదాస్ చూడాల్సిందేనంటున్నాడు.