ఇది ‘నాని’కే సాధ్యం – ఈ సినిమాలే సాక్ష్యం

Thursday,August 29,2019 - 10:02 by Z_CLU

పెన్సిల్ పార్థసారథి… ఈ క్యారెక్టర్ పేరు చాలు… సినిమా పేరు ‘గ్యాంగ్ లీడర్’ అని అర్థమయిపోతుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా ఎగ్జాక్ట్ కథేంటనేది రివీల్ చేయట్లేదు నాని ఈ సినిమాలో ఎంత కొత్తగా కనిపించబోతున్నాడనేది తెలిసిపోతుంది. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం నానికే సాధ్యమేమో…

గ్యాంగ్ లీడర్ : ఐదుగురు ఆడవాళ్ళు ఉన్న గ్యాంగ్ కి లీడర్. అలాగని అదిరిపోయే హీరోయిజం… సీరియస్ నెస్ లాంటివేవీ పెద్దగా కనిపించవు. నచ్చిన పుస్తకాలను కాపీ కొట్టేసి టైటిల్ మార్చేసి ఫేమస్ రివేంజ్ రైటర్ అనుకుంటూ బ్రతికేసే ఓ సాధారణ క్యారెక్టర్… ఫేక్ రైటర్ అయినా అప్పుడే ఈ పెన్సిల్ పార్థసారథికి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

దేవదాస్ : ఇన్నోసెంట్ డాక్టర్.. అలాగని క్యారెక్టర్ వీకా..? అంటే అస్సలు కాదు.. పవర్ ఫుల్ డాన్ మైండ్ సెట్ ని కూడా మార్చగలిగేంత స్ట్రాంగ్.. కానీ సినిమా మొత్తంలో ఈ దాస్.. నవ్విస్తూనే ఉంటాడు..

V : ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘V’ లో కూడా నాని ప్లే చేసేది స్పెషల్ క్యారెక్టరే… అప్పుడే ఈ క్యారెక్టర్ గురించి పెద్దగా చేపాలెం కానీ.. నాని చేస్తున్నాడు కాబట్టే సమ్ థింగ్ డెఫ్ఫినెట్ గా స్పెషల్ గా ఉండబోతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.