హ్యాట్రిక్ కొట్టిన రష్మిక మండన్న

Friday,September 28,2018 - 12:34 by Z_CLU

రిలీజైన ప్రతి కార్నర్ నుండి సూపర్ హిట్ టాక్ అందుకుంటుంది దేవదాస్ సినిమా. నాగార్జున, నానిల మల్టీస్టారర్ అనగానే క్రియేట్ అయిన అంచనాలను ఈజీగా అందుకున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ రష్మికని మరోసారి లక్కీ హీరోయిన్ గా ప్రూఫ్ చేసింది. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ గా హ్యాట్రిక్ అందుకుంది రష్మిక.

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయిన రష్మిక ‘గీతగోవిందం’ సినిమాతో యూత్ కి దిల్ కీ ధడ్కన్ అనిపించేంతలా మెస్మరైజ్ చేసింది. వరసగా వచ్చిన 2 సూపర్ హిట్లకు ఇప్పుడీ ‘దేవదాస్’ సక్సెస్ కూడా ఆడ్ అవ్వడంతో, టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది రష్మిక మండన్న.

ఈ సినిమాలో నాని సరసన పోలీసాఫీసర్ గా నటించింది రష్మిక మండన్న. కరియర్ బిగినింగ్ నుండే అటు పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ, సూపర్ స్పీడ్ ముందుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ లోను హీరోయిన్ గా నటిస్తుంది.