అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ పై నాగ్ క్లారిటీ

Tuesday,September 25,2018 - 03:30 by Z_CLU

అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ పై స్పందించాడు కింగ్ నాగార్జున.. ఇటీవలే ‘దేవదాస్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాగ్ అఖిల్ బాలీవుడ్ మూవీ గురించి కొన్ని విషయాలు తెలియజేసాడు. అఖిల్-కరణ్ జోహార్ కాంబోలో సినిమా ఉంటుందా.. అన్న ప్రశ్నకి తన మనసులో మాటను బయటపెట్టి క్లారిటీ ఇచ్చాడు కింగ్…

“కరణ్ -అఖిల్ ఎప్పటి నుండో మంచి ఫ్రెండ్స్ , అఖిల్ ను బాలీవుడ్ లో పరిచయం చేసే భాధ్యత తనకివ్వమని కరణ్  అడుగుతున్నాడు. కానీ ముందు తెలుగులో ఓ మంచి సినిమా తీసి ఆ సినిమాతో బాలీవుడ్ లో ఎంటర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నా.. నేను కూడా ‘శివ’ సినిమాతో అలాగే ఎంటర్ అయ్యాను.. అదే కరణ్ కి కూడా చెప్పడం జరిగింది.. వాళ్ళిద్దరు కలిసినప్పుడు బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు.. కానీ ఆ సినిమాకి ఇంకాస్త టైం పడుతుందని తెలిపాడు.

తెలుగులో అఖిల్ తొందరపడ్డాడు… కానీ అలాంటి పొరపాటు బాలీవుడ్ ఎంట్రీ కి జరగకుండా నేనే పెద్దరికం తీసుకొని ప్లాన్ చేస్తా అంటూ.. ..” అఖిల్ సినిమా పై తన మనసులో మాట బయటపెట్టాడు కింగ్. సో ఇప్పుడప్పుడే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఉండదన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు నాగ్.