‘దేవదాస్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Sunday,December 23,2018 - 11:32 by Z_CLU

నాగార్జున, నాని ల ఫన్ ఫిల్డ్ మల్టీస్టారర్ ‘దేవదాస్’. రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈరోజు సాయంత్రం 5:30 కు, జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ కానుంది.

టాలీవుడ్ లో మల్టీస్టారర్ అంటే అంత ఈజీగా సెట్స్ పైకి రాదు. అందునా, నాగ్ లాంటి స్టార్ హీరో, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ కుదరాలంటే డెఫ్ఫినెట్ గా సమ్ థింగ్ స్పెషల్ అనిపించే ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అలా అన్ని కుదిరాయి కాబట్టే ‘దేవదాస్’ తెరకెక్కింది. బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Devadas – World Television Premiere this Sunday 5:30 PM

A complete Entertainer – #Devadas #WorldTelevisionPremiere this Sunday at 5:30 PM only on #ZeeTelugu

Posted by Zee Telugu on Monday, 17 December 2018

 

 

ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే కథ కన్నా ముందు సినిమాలో, నాని, నాగార్జున ల కాంబో గురించే ఎక్కువగా మాట్లాడాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఉండే సీన్స్, జస్ట్ అవుట్ స్టాండింగ్. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ 2 క్యారెక్టర్స్ మధ్య క్రియేట్ చేసిన ఇమోషనల్ బాండింగ్, మరీ ముఖ్యంగా కామెడీ సీన్స్ లో వీరిద్దరి టైమింగ్, సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అవ్వగలిగే సినిమా దేవదాస్. నాగార్జున డాన్ లా, నాని ఇన్నోసెంట్ డాక్టర్ లా కడుప్పుబ్బ నవ్వించే ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ని, జీ తెలుగు తో పాటు జీ తెలుగు HD ఛానల్స్ లో ఈరోజు 5:30 కు మిస్ కాకుండా చూడండి.