ఇది మల్టీస్టారర్స్ టైమ్

Thursday,February 28,2019 - 10:02 by Z_CLU

మల్టీస్టారర్స్ కి అన్నీ కలిసొస్తున్నాయి. గతంలో స్టార్స్ కి మల్టీస్టారర్ చేయాలని ఉన్నా, సరైన కథల్లేక పోవడమో, సక్సెస్ గ్యారంటీ చాన్సెస్ లేకపోవడమో ఇలా ఏదో  కారణం అడ్డు పడేది. కానీ ఇప్పుడు టైమ్ మారింది. ఓ మల్టీస్టారర్ సెట్స్ పై ఉండగానే మరో మల్టీస్టారర్ అనౌన్స్ చేస్తున్నారు.

RRR: మల్టీస్టారర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మాట్లాడాల్సింది RRR గురించి. కనీసం కలలో కూడా ఊహించని కాంబినేషన్. గతంలో ఇలాంటి కాంబో డిస్కర్షన్స్ వస్తే సవాలక్ష రీజన్స్ బయటికి వచ్చేవి. ఫ్యాన్స్ ని స్యాటిస్ఫై చేయడం కష్టం, అసలు ఆ రేంజ్ కథ దొరకడం కష్టం… వగైరా.. వగైరా… బాహుబలి తరవాత  రాజమౌళి తన స్టైల్ లో ఇలా బ్రేక్ తీసుకున్నాడో లేదో , చిన్నగా సినిమాని అనౌన్స్ చేశాడు. అంతే సింపుల్ గా సెట్స్ పైకి తీసుకు వచ్చేశాడు.

వెంకీమామ : సినిమా ఇప్పుడు సెట్స్ పై ఉంది. ప్లానింగ్ మహా అయితే 6 నెలల క్రితం నుండి బిగిన్ అయి ఉంటుంది. కానీ ఈ కాంబోకి ఉన్న డిమాండ్ చాలా పాతది. ఈ మామా అల్లుళ్ళు స్క్రీన్ పై చేసే మ్యాజిక్ ని చూడాలని ఫ్యాన్స్  లాంగ్ లాంగ్ బ్యాక్ నుండి వెయిటింగ్. అది ఇప్పటికి కుదిరింది.

 

F2 : మొత్తం ఫ్యామిలీస్ కి ఫ్యామిలీస్ ని థియేటర్స్ కి రప్పించిన సినిమా. ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కాంబినేషన్ అనే కంటే, సర్ ప్రైజింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. వెంకీ, వరుణ్ తేజ్ లను అసలు ఒకే స్క్రీన్ పై చూడొచ్చనే ఆలోచన  ప్రేక్షకుల్లో కూడా లేదు. అప్పుడు వచ్చింది F2. కంప్లీట్ గా రిఫ్రెషింగ్ కాంబినేషన్. సినిమా సక్సెస్ కి ఈ ఇద్దరు స్టార్స్ కెమిస్ట్రీ కూడా ఓ పెద్ద రీజన్.

దేవదాస్ : పక్కా నాని, నాగార్జునల కోసమే రాసుకున్న స్క్రిప్ట్ ఇది. కథ లాక్ అవ్వకముందే కాంబినేషన్ ఫిక్సయింది మరీ. సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే బాండింగ్ అంతే న్యాచురల్ గా స్క్రీన్ పై ఎలివేట్ అయింది. అందుకే సినిమా సక్సెస్ అయింది.

ఈ వరసలో మరిన్ని మల్టీస్టారర్స్ కి ప్లానింగ్ జరుగుతుంది. అసలు చాన్సే లేదు అనుకునే కాంబినేషన్స్ తో సినిమాల ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అందుకే ఇది మల్టీస్టారర్స్ టైమ్.