సూపర్ స్పీడ్ లో నాగశౌర్య ‘నర్తనశాల’

Friday,April 20,2018 - 12:16 by Z_CLU

ప్రస్తుతం శ్రీనివాస చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నర్తనశాల’ తో బిజీగా ఉన్నాడు నాగశౌర్య. ‘ఛలో’ లాంటి సక్సెస్ ఫుల్ ఎంటర్ టైనర్ తరవాత తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

క్యూరాసిటీ రేజ్ చేసేలా డిఫెరెంట్ టైటిల్ తో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యాగ్జిమం ఆగష్టు లో షూటింగ్ కంప్లీట్ చేసుకునేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర పని చేసిన శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమాకి సాగర్ మహతి మ్యూజిక్ కంపోజర్.