వింటేజ్ గెటప్స్ లో హీరోయిన్స్

Tuesday,July 02,2019 - 10:03 by Z_CLU

‘రణరంగం’ టీజర్ లో కళ్యాణి ప్రియదర్శన్ కొత్తగా కనిపిస్తుంది. బేసిగ్గా సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో కావడంతో వింటేజ్ గెటప్ లో కళ్యాణి ప్రియదర్శన్ అదుర్స్ అనిపిస్తుంది. సినిమాలో ఎగ్జాక్ట్ గా కళ్యాణి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్నది ఇంకా రివీల్ కాలేదు… డెఫ్ఫినెట్ గా ‘రణరంగం’ కళ్యాణి లుక్స్ బెస్ట్ అనిపించుకుంటున్నాయి. ఈ వరసలో వింటేజ్ గెటప్స్ లో కనిపించి ఇంప్రెస్ చేస్తున్న హీరోయిన్స్ ఇంకొంత మంది ఉన్నారు.

శివానీ రాజశేఖర్ : డెబ్యూ సినిమాకే ఇలాంటి క్యారెక్టర్ దొరకడం శివానీకి కలిసొచ్చిందనే చెప్పాలి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామా లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘దొరసాని’ లా ఆకట్టుకుంటుంది.

అదాశర్మ : 1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది ‘కల్కి’. ఈ సినిమాలో చాన్స్ కొట్టేసిన అదాశర్మ వింటేజ్ గెటప్ లో డాక్టర్ లా, గత సినిమాల కన్నాకొత్తగా కనిపించి మెస్మరైజ్ చేసింది.     

మహానటి – సావిత్రిలా కీర్తి సురేష్, ఆమె గురించి రీసర్చ్ చేసే జర్నలిస్ట్ లా సమాంత ఇద్దరికిద్దరూ సినిమాలో కనిపించింది వింటేజ్ గెటప్స్ లోనే. ఈ ఇద్దరి కరియర్ లో ‘మహానటి’ ఎప్పటికీ స్పెషల్ సినిమానే.

రంగస్థలం – డీ గ్లామరస్ లుక్స్ లో కూడా గ్రేస్ ఫుల్ గా అనిపించింది. 1980 బ్యాక్ డ్రాప్ లో ఆ గెటప్ కి తగ్గట్టు సమాంత పర్ఫామెన్స్… జస్ట్ అవుట్ స్టాండింగ్ అనిపించుకుంది.

అంతెందుకు ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిలా రకుల్ ప్రీత్, జయసుధలా పాయల్ రాజ్ పూత్, హన్సిక మొత్వానీ జయప్రదలా కనిపించి వింటేజ్ గెటప్స్ లో మెస్మరైజ్ చేశారు. వీరితో పాటు ఇప్పుడు సెట్స్ పై ఉన్న సైరా లో కూడా తమన్నా, నయనతార ఇలాంటి వింటేజ్ గెటప్ లోనే కనిపించబోతున్నారు.