కళ్యాణి ప్రియదర్శన్ - ‘హలో’ తరవాత మళ్ళీ ఇప్పుడే...

Tuesday,July 23,2019 - 12:03 by Z_CLU

అఖిల్ హలో’ సినిమాతో పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. లవ్ ఎంటర్ టైనర్ కాబట్టి జస్ట్ సాంగ్స్ కే పరిమితం అనిపించేలా కాకుండారిజిస్టర్ అయ్యే స్థాయి రోల్ దక్కింది. ఈ సినిమా సక్సెస్ తరవాత కళ్యాణి టాలీవుడ్ లో బిజీ అయిపోతుందనుకున్నారంతా… కానీ అలా జరగలేదు..

హలో’ తరవాత కళ్యాణి కనిపించింది ఒక్క చిత్రలహరి సినిమాలో. అందులో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిందనేది పేరుకు మాత్రమే కానీ, క్రెడిట్ మొత్తం నివేత పేతురాజ్ కే వెళ్ళింది. కానీ శర్వా రణరంగం’ లో అలా కాదనిపిస్తుంది.

1980 బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్న కళ్యాణి లుక్స్ తో ఇప్పటికే ఇంప్రెస్ చేసేసింది. దానికి తోడు రిలీజైన సింగిల్స్ ని బట్టి కళ్యాణికి ఈ సినిమాలో పర్ఫామెన్స్ కి కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టరే దొరికిందనిపిస్తుంది.

ఆఫ్ స్క్రీన్ కూడా పెద్దగా హడావిడి ఏం లేకుండా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోయే కళ్యాణి ప్రియదర్శన్ రణరంగంసినిమాతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంటుందనే వైబ్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. సినిమా రిలీజైతేనే అసలు విషయం తెలుస్తుంది.