షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కళ్యాణి ప్రియదర్శన్

Wednesday,October 17,2018 - 12:02 by Z_CLU

అఖిల్ ‘హలో’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయి, ఫస్ట్ మూవీతోనే సక్సెస్ ఫుల్ మార్క్ క్రియేట్ చేసుకుంది కళ్యాణి ప్రియదర్శన్. అందుకే ఇమ్మీడియట్ గా సుధీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో గీతగా కనిపించనున్న కళ్యాణి, నిన్నటితో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

ఈ సినిమాలో గీత గా కనిపించనుందట కళ్యాణి. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండబోతుందో తెలీదు కానీ, ఈ సినిమాలో గన్ కూడా కాలుస్తుందట కళ్యాణి ప్రియదర్శన్. ఈ విషయాన్ని సుధీర్ వర్మ కి థాంక్స్ చెప్పుకుంటూ, ట్వీట్ లో రివీల్ చేసింది ఈ హీరోయిన్.

ఈ సినిమాలో మాఫియా డాన్ లా కనిపించనున్నాడు శర్వానంద్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి వచ్చింది.