ప్రభాస్ ‘సాహో’ లో మరో బాలీవుడ్ ఎట్రాక్షన్

Friday,April 20,2018 - 12:55 by Z_CLU

ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ప్రభాస్ ‘సాహో’. భారీ కాన్వాస్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా  నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్ లో ఎవెలిన్ శర్మను ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

ఇప్పటికే నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, టిన్ను ఆనంద్ వంటి బాలీవుడ్ నటులను సినిమాలోని కీ రోల్స్ కోసం ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, సినిమాలో ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే నెగెటివ్ రోల్ లో ఎవెలిన్ ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎవెలిన్ పవర్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా బిగిన్ చేసిన  ఎవెలిన్ ఈ సినిమా కోసం దాదాపు 10 కిలోల బరువు  పెరగనుందట.   

 

 

ప్రస్తుతం కంప్లీట్ ఫోకస్ షూటింగ్ పై పెట్టిన సాహో టీమ్, రైట్  టైమ్ చూసుకుని ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. UV క్రియేషన్స్ బ్యానర్ లో సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది సాహో సినిమా. శంకర్- ఎహసాన్- లాయ్ మ్యూజిక్ కంపోజర్స్.