అమ్మనే ఆదర్శం తీసుకున్నాను !

Monday,August 12,2019 - 04:43 by Z_CLU

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రణరంగం’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ప్రియదర్షన్ మీడియాతో ముచ్చటించింది. సినిమాలో తన క్యారెక్టర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది కళ్యాణి.

కళ్యాణి మాట్లాడుతూ” ‘రణరంగంలో’ గీత అనే క్యారెక్టర్ లో 90లో హీరోయిన్ గా కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ కి మా అమ్మనే ఆదర్శంగా తీసుకున్నాను. అమ్మ నటించిన  అప్పటి కొన్ని సినిమాలు మళ్ళీ చూసాను. ఇక  సినిమాలో శర్వానంద్ ది చాలా ఇంటెన్స్ తో ఉండే క్యారెక్టర్. తనకి ఎంతో కొంత రిలాక్స్ అంటే అది నేనే. ఆ క్యారెక్టర్ ను కాస్త ప్రేమగా చూసేది నా క్యారెక్టర్ ద్వారానే. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను. అలాగే నాన్నకి నన్ను లంగావోణిలో చూడటం ఇష్టం. సో ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ వచ్చింది. “అని తెలిపింది