ఓంకార్ తో కింగ్ ఎక్స్ పెరిమెంట్

Monday,October 17,2016 - 03:44 by Z_CLU

రాజుగారి గదిలోకి కింగ్ ఎంటరయ్యాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరక్షన్ లో  ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉన్న నాగార్జున… హారర్ సినిమాకి సంతకం చేశాడు. ఆ మధ్య ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజుగారి గది’ సినిమాకి ఇది సీక్వెల్ గా రాబోతోంది.

collage-123

రొమాంటిక్ సినిమాలతో టాలీవుడ్ మన్మధుడు అనిపించుకున్న నాగార్జున, ఇప్పటివరకు అటు యాక్షన్ సినిమాల్లోనూ, ఇటు భక్తి సినిమాల్లోనూ కావాల్సినంత వేరియేషన్స్ చూపించాడు. ఇక రొమాంటిక్ సెగ్మెంట్ లో కింగ్ ను క్రాస్ చేసే వాళ్లే లేరు. కెరీర్ లో తొలిసారిగా హారర్ జోనర్ లోకి అడుగుపెట్టబోతున్నాడు నాగ్. ఈ సీక్వెల్ హిట్ అయితే కనుక దర్శకుడు ఓంకార్, బడా దర్శకుల లిస్ట్ లోకి చేరిపోవడం ఖాయం.