మెగా ఐటెం గర్ల్....
Monday,October 17,2016 - 04:00 by Z_CLU
ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా ఐటెంసాంగ్స్ తో హల్ చల్ చేస్తోంది లక్ష్మీ రాయ్. ‘కాంచనమాల కేబుల్ టి.వి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. రవితేజ నటించిన ‘బలుపు’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఐటెం గర్ల్ గా దూసుకెళ్తుంది.

ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో ఐటెంగర్ల్ గా మారి పవర్ స్టార్ తో స్టెప్స్ వేసిన లక్ష్మి రాయ్ ఆ సాంగ్ తో టాలీవుడ్ లో స్టార్ ఐటెం గర్ల్ ఇమేజ్ ను మరింత పెంచుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నెం 150’ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ అందుకుంది. ఇలా వరుసగా మెగా హీరోలతో ఐటెం సాంగ్స్ చేస్తూ మెగాఐటెం గర్ల్ గా మారిపోయింది.