#Nag99 సంక్రాంతి బరిలో నాగార్జున ?

Tuesday,August 22,2023 - 03:41 by Z_CLU

‘ఘోస్ట్’ సినిమా తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న నాగార్జున నెక్స్ట్ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్ చేయబోయే నెక్స్ట్ సినిమాను ఆగస్ట్ 29న బర్త్ డే సందర్భంగా టీజర్ తో ఎనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘నా సామీ రంగా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఎనౌన్స్ మెంట్ టీజర్ కి సంబంధించి ఘాట్ ఫినిష్ చేశారు. నాగార్జున డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14 న రిలీజ్ ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇంత షార్ట్ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని సినిమాను జనవరిలో చేయడం మేకర్స్ కి పెద్ద ఛాలెంజే.

సంక్రాంతి సీజన్ లో నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ , ‘బంగార్రాజు’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నాడు.