గెటప్ మార్చిన సీనియర్ హీరో....

Monday,October 17,2016 - 01:41 by Z_CLU

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గెటప్ మార్చాడు. ప్రస్తుతం హీరో గా సినిమాలు చేస్తూనే మరో వైపు స్టార్ హీరో ల సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రీకాంత్ తాజా గెటప్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

jagapathi-srikanth

    సూట్ వేసుకొని వైట్ గడ్డంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సీనియర్ హీరో ఉన్నట్టుండి తన గెటప్ ఎందుకు మార్చినట్టు? మరో సీనియర్ హీరో జగపతి బాబు లా స్టైలిష్ విలన్ అవతారం ఎత్తనున్నాడా? ఇన్నాళ్లూ పాజిటివ్ క్యారెక్టర్ రోల్స్ చేసిన శ్రీకాంతా్… ఇప్పుడు జగపతిబాబులా స్టయిలిష్ విలన్ గా మారే ఆలోచనలో ఉన్నాడా.. ఇలా ఈ ఫొటో చూస్తే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలే సరైనోడు సినిమాలో ఓ కీ రోల్ చేసిన ఈ సీనియర్ హీరో… తన నయా గెటప్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.