'రాజు గారి గది 2' కి నాగ్ కండిషన్స్...

Wednesday,September 20,2017 - 01:12 by Z_CLU

రాజుగారి గది-2 ట్రయిలర్ లాంచ్ అయింది. ఈ ట్రయిలర్ వెనక జరిగిన కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పుకొచ్చాడు నాగార్జున. కొన్ని కండిషన్స్ పెట్టి మరీ ట్రయిలర్ కట్ చేయించాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు కింగ్.

ముందు ఓంకార్ ఓ ట్రైలర్ చూడమని పంపించాడు.. కానీ ఆ ట్రైలర్ నాకు నచ్చకపోవడంతో వెంటనే బాగాలేదని చెప్పేసాను. ఒక రోజు టైం ఇవ్వండి అంటూ నెక్స్ట్ డే ఈ ట్రైలర్ కట్ చేయించి పంపించాడు. ట్రైలర్ చూడగానే బాగాలేదు అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా కనిపించలేదు. ట్రైలర్ బాగుంది. నాకు బాగా నచ్చింది గో హెడ్ అన్నాను. ట్రైలర్ చూడగానే థమన్ మ్యూజిక్ హైలైట్ అనిపించింది. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని టెక్నీషియన్స్ అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది. కచ్చితంగా అందరినీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇక సినిమాకు విజువల్ ఎఫెక్స్ట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఆ వర్క్ చూసాకే డబ్బింగ్ చెపుదామని వెయిట్ చేస్తున్నాను. అది పర్ఫెక్ట్ అనిపించాకే డబ్బింగ్ స్టార్ట్ చేస్తా. ” అంటూ తను సినిమాకు పెట్టిన కండిషన్స్ గురించి తెలిపాడు నాగ్.