తమిళ స్పైడర్ సెన్సార్ పూర్తి, భారీ స్థాయిలో రిలీజ్

Wednesday,September 20,2017 - 12:09 by Z_CLU

తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్పైడర్ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తెలుగు సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను మెచ్చుకున్న కొన్ని గంటలకే తమిళ సెన్సార్ బోర్డు కూడా స్పైడర్ చూసి ఫిదా అయింది. మురుగదాస్ డైరక్షన్ తో పాటు.. మహేష్ యాక్టింగ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చెన్నై సెన్సార్ సభ్యులు. తమిళ వెర్షన్ కు కూడా U/A వచ్చింది. ఎలాంటి కట్స్ లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ సైన్ బోర్డులు కూడా లేవు.

స్పైడర్ సినిమాతో మహేష్ బాబు గ్రాండ్ గా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం తెలిసిందే. పైగా ఈ సినిమాకు మురుగదాస్ దర్శకుడు కావడంతో.. తమిళనాడు ప్రేక్షకుల్ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు స్పైడర్. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ స్థాయిలో ముూవీని విడుదల చేస్తున్నారు. మొదటి రోజు స్పైడర్ సినిమాను తమిళనాట ఏకంగా 450 స్క్రీన్స్ పై విడుదల చేస్తున్నారు.

120 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా విడుదలకు ముందే దాదాపు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ కు ఇప్పట్నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఒక్క అమెరికాలోనే 600కు పైగా లొకేషన్లలో స్పైడర్ సినిమా విడుదలకానుంది.