టాకీపార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘రాజా ది గ్రేట్’

Wednesday,September 20,2017 - 02:02 by Z_CLU

రవితేజ ‘రాజా ది గ్రేట్’ మూవీలోని హై ఇంటెన్సివ్ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్యాకప్ చెప్పేసింది సినిమా యూనిట్. నిన్నటి వరకు రాయ్ ఘడ్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, టాకీపార్ట్ కూడా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం కేరళలోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లలో సాంగ్స్ తెరకెక్కించే పనిలో పడింది రాజా ది గ్రేట్ టీమ్.

రవితేజ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.  సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్టర్.  అక్టోబర్ 12 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.