అఖిల్ సినిమాపై నాగ్ చెప్పిన విశేషాలు

Monday,August 28,2017 - 02:13 by Z_CLU

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హలో’.. ఇటీవలే టైటిల్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్ లుక్ తో అందరినీ ఇంప్రెస్స్ చేసిన ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పాడు కింగ్ నాగార్జున.

ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ ” సినిమా మొదలైనప్పటి నుంచి కథకి ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుందా.. అని విక్రమ్ తో పాటు అందరం బాగా ఆలోచించాం.. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో సడెన్ గా ఈ టైటిల్ స్ట్రైక్ అయ్యింది. వెంటనే ఆఫీస్ కి ఫోన్ చేసి ఈ టైటిల్ రిజిస్టర్ చేయమని చెప్పాను. కొంచెం టైం పడుతుంది 10 గంటల తర్వాతే చేయించగలం అని చెప్పారు. టైటిల్ రిజిస్టర్ చేయించే వరకూ టైటిల్ దొరుకుంతుందో.. లేదో..అని తెగ టెన్షన్ పడ్డాను. తీరా చూస్తే ఇంకా ఎవ్వరూ రిజిస్టర్ చేయించలేదు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ అనేది చాలా కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నాం. ముందు ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేసి నాన్నతో ఎండ్ చేయాలనీ చూశాం. మేం అనుకున్నట్లు ఎన్టీఆర్ గారిది క్లిప్ దొరకలేదు. అందుకే తారక్ తో స్టార్ చేసి నాన్న గారితో ఎండ్ చేశాం. మేం అనుకున్నదానికంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. నాన్న గారు టైటిల్ అనౌన్స్ చేయడం ఫాన్స్ లో జోష్ నింపింది.

సినిమా చాలా బాగా వస్తుంది. యాక్షన్ & లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఓ అమ్మాయి హలో ఎప్పుడు చెప్తుందో అని ఎదురుచూసే ఓ అబ్బాయి లవ్ స్టోరీ ఇది. ఫాన్స్ తో పాటు కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది. ” అన్నారు.