బాలయ్య చేయాలనుకుంటున్న డ్రీమ్ రోల్

Monday,August 28,2017 - 01:40 by Z_CLU

బాలయ్య పైసావసూల్ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో రీ లాంచ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పుకున్న బాలయ్య ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ లో చాలా ఇంటరెస్టింగ్ ఎక్స్ పీరియన్సెస్ షేర్ చేసుకున్నాడు.

పూరి పైసా వసూల్ లో మాస్ లుక్స్ లో ఎంటర్ టైన్ చేయనున్న బాలయ్య రైతులా నటించాలన్నది తన డ్రీమ్ రోల్  అని చెప్పుకున్నాడు. కాకపోతే అలాంటి పాత్ర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, టెక్నీషియన్స్ దగ్గరి నుండి కాస్టింగ్ వరకు అన్ని పర్ ఫెక్ట్ గా ఉంటేనే చేస్తానని చెప్పుకున్నాడు బాలయ్య.

ఇకపోతే పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 1 నుండి థియేటర్స్ లలో సందడి చేయనుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని V. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.