చైతన్య పై న్యూస్.. ఖండించిన నాగ్...

Monday,July 03,2017 - 02:50 by Z_CLU

సోషల్ మీడియాలో నాగ్ చాలా ఆక్టివ్ గా ఉంటూ ఫాన్స్ కి ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్న విషయం తెలిసిందే.. తనకి సంబంధించి ఏ వార్త వచ్చిన సోషల్ మీడియా ద్వారా దాన్ని ఖండిస్తుంటాడు నాగ్. లేటెస్ట్ గా చైతు పై వచ్చిన ఓ న్యూస్ ని ఖండిస్తూ ఇందులో నిజం లేదని తేల్చేశాడు..

ఇటీవలే మాసివ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో నాగ్ అఖిల్ మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడని అందుకు గాను బోయపాటి కి నాగ్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ప్రెజెంట్ అఖిల్ విక్రమ్ కుమార్ తో సెట్స్ పై ఉండటం, ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుండడంతో నాగ్ అఖిల్ ప్లేస్ లో బోయపాటి తో చైతు ని ప్లాన్ చేస్తున్నాడని, ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయ్యిందనే న్యూస్
టాలీవుడ్ లో ఓ చిన్న సైజు సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే లేటెస్ట్ గా ఈ న్యూస్ ను ఖండించిన నాగ్ సోషల్ మీడియా ద్వారా ఇది నిజం కాదని తేల్చి చెప్పేశాడు. సో ఈ కామెంట్ తో నాగ్ అఖిల్ మూడో సినిమా బోయపాటి తోనే ఉంటుందని హింట్ ఇచ్చాడా..లేదా అసలు బోయపాటి కి అడ్వాన్స్ ఇచ్చిన వార్తలో నిజం లేదని చెప్పాడా..తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. .