వాసుకి వస్తోంది.. ఈ నెలలోనే

Monday,July 03,2017 - 03:42 by Z_CLU

నయనతార లీడ్ రోల్ లో హార్ట్ టచింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కింది వాసుకి సినిమా. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘పుదియ నియమం’ కు రీమేక్ గా వస్తోంది ‘వాసుకి’. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోను అదే రేంజ్ లో హిట్టవ్వడం  గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్, ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. దానికి తోడు నయనతార పర్ఫామెన్స్ సినిమాకి పెద్ద ఎస్సెట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని ఈ నెలలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.