నాని మళ్ళీ అదే డైరెక్టర్ తో...

Monday,July 03,2017 - 02:05 by Z_CLU

న్యాచురల్ స్టార్ ప్రస్తుతం M.C.A. సెట్స్ పై ఉన్నాడు. దాంతో పాటు జూలై 7 న రిలీజ్ కానున్న ‘నిన్నుకోరి’ సినిమా ప్రమోషన్స్ లోను బిజీగా ఉన్న నాని, అప్పుడే M.C.A తరవాతి సినిమాకి కూడా డిస్కషన్ బిగిన్ చేసేసినట్టు తెలుస్తుంది.

గతంలో నాని ‘జెండా పై కపిరాజు’ సినిమాకు డైరెక్షన్ చేసిన సముద్రఖని తో మరో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా అనౌన్స్ కాలేదు కానీ, నాని మాత్రం ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్.

 

ఇక MCA విషయానికి వస్తే ఈ సినిమా కూడా నాని స్టైల్ లో ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్, దిల్ రాజు ప్రొడ్యూసర్.