నభా నతేష్ ఇంటర్వ్యూ

Tuesday,September 18,2018 - 02:12 by Z_CLU

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ సినిమా. ఈ నెల 21 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అందునా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ కూడా భారీగా ఉన్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నతేష్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది అవి మీకోసం..

ఇదే నా డెబ్యూ…

‘అదుగో’ సినిమాలో కూడా నటించాను కానీ, ఇదే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ‘నన్ను దోచుకుందువటే’ నా డెబ్యూ… కన్నడ సినిమాలో నా పర్ఫామెన్స్ చూసి, ఈ సినిమాలో అవకాశం దొరికింది.

నా ఫీలింగ్ అదే…

లాంగ్వేజ్ తెలీకుండా నటిస్తే కాన్సంట్రేషన్ అంతా బట్టి పట్టిన డైలాగ్స్ పైనే ఉంటుంది. 100% పర్ఫామ్ చేయలేనని నా ఫీలింగ్, అందుకే తెలుగు నేర్చుకున్నా.

ఇక థియేటర్స్…

బెంగళూర్ లో చదువుకునేటప్పుడే థియేటర్స్ చేశాను. ఇండియా మొత్తంలో చాలా చోట్ల పర్ఫామ్ చేశాను. సినిమాలో నటించాలనేదే టార్గెట్, దానికి థియేటర్స్ బేసిక్స్, అందుకే నేర్చుకున్నా, మాడలింగ్ కూడా చేశా.

అలా అనుకుంటున్నా…

జస్ట్ బిగ్ స్టార్ సినిమాలనే కాకుండా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలనుకుంటున్నా. ఒక పర్టికులర్ ఇమేజ్ కి స్టిక్ అవకుండా, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా.

అది నా క్యారెక్టర్…

సినిమాలో నాది చాలా డిఫెరెంట్ రోల్. ఓ 4 షార్ట్ ఫిలిమ్స్ చేసేసి, ఇప్పుడు స్టార్ అయిపోయాను, బయటికి వెళ్తే ఫ్యాన్స్ వచ్చేస్తారు అని ఫీలయిపోతుంటా. నేనే యూ ట్యూబ్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ పేరుతో, కామెంట్స్ పోస్ట్ చేసి అందరితో గొప్పగా చెప్తుంటా… చాలా ఎగ్జైటింగ్ క్యారెక్టర్.

సుధీర్ బాబు…

సుధీర్ బాబుతో పని చేసేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీలయ్యా. ఇది నాకు తెలుగులో ఫస్ట్ మూవీ కాబట్టి, ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాడనిపించేది. ఎప్పుడైనా రిహార్స్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా చాలా కో ఆపరేట్ చేసేవాడు. అందుకే నేనెక్కడా టెన్షన్ పనినట్టు నాకు గుర్తు లేదు. సినిమా ఇలా స్టార్ట్ అయింది ఇలా కంప్లీట్ అయిందనిపించింది.  

నో ప్రెజర్…

ఒక్క లాంగ్వేజ్ విషయంలోనే కొంచెం ప్రెజర్ గా ఫీలయ్యాను కానీ, క్యారెక్టర్ విషయంలో ఎక్కడ కూడా ప్రెజర్  ఫీలవ్వలేదు. సెట్స్ పైకి రాకముందే చాలా హోమ్ వర్క్ చేశాను. ప్రతి డైలాగ్ నేర్చుకున్నాను.

అలా ఏం ఉండదు…

గ్లామరస్ రోల్స్, నాన్ గ్లామరస్ అంటూ డిఫెరెంట్ గా ఏం ఉండవు నా దృష్టిలో. ఏదైనా మనం చేసే క్యారెక్టర్ ని బట్టే ఉంటుంది. చేసే ఏ క్యారెక్టర్ అయినా నా కంఫర్ట్ జోన్ లో ఉంటే చేసేస్తా.

అదే ప్లస్…

ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్ళతో పని చేయాలనుకుంటున్నా. అప్పుడే మనం వాళ్ళ దగ్గరి నుండి నేర్చుకునే అవకాశం  దొరుకుతుంది. ఓ వైపు మనకు నచ్చిన పని చేసుకుంటూనే, చాలా నేర్చుకోవాలి.