అశ్విని దత్ ఇంటర్వ్యూ

Tuesday,September 18,2018 - 04:17 by Z_CLU

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది దేవదాస్ సినిమా. ఈ నెల 27 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకి అశ్విని దత్ నిర్మాత. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, దేవదాస్ సినిమా విషయాలతో పాటు, తన కరియర్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని మీడియాతో షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…

అదే దేవదాస్ సినిమా…

2 డిఫెరెంట్ మైండ్ సెట్స్ ఉన్న ఫ్రెండ్స్… వారిద్దరి జర్నీని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. అద్భుతంగా వచ్చిందీ సినిమా…

వైజయంతీ మూవీస్…

సగటు ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు రిలాక్స్డ్ గా ఫీలవ్వాలి, మంచి అనుభూతికి లోనవ్వాలి అనే ఉద్దేశంతోనే వైజయంతీ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలే వస్తాయి. వైజయంతీ బ్యానర్ వందేళ్ళు ఉంటుంది.

అలా జరిగింది…

ఈ స్టోరీలైన్ అనుకున్న తరవాత నాని, నాగార్జునలిద్దరూ రిఫర్ చేసిన పేరు శ్రీరామ్ ఆదిత్య. అప్పటికే శ్రీరామ్ ‘భలే మంచి రోజు’ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. శమంతకమణి చేసేటప్పుడే శ్రీరామ్ తో మాట్లాడటం జరిగింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ పట్టింది. స్టోరీ డెవెలప్ మెంట్ ప్రాసెస్ లో చాలామంది రైటర్స్ తో ట్రావెల్ చేశాడు శ్రీరామ్ ఆదిత్య.

NTR లాగే నాగార్జున…

నాగార్జున తో ‘ఆజాద్’ తరవాత మళ్ళీ మా బ్యానర్ లో సినిమా చేయలేదు. నాగార్జున గారిలో చాలా మార్పు ఉంది. స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే విధానం కానీ, ఫిల్మ్ మేకింగ్ లో ఇచ్చే సజెషన్స్ కానీ చూస్తుంటే NTR గారు గుర్తొచ్చారు.

అవే అద్భుతం…

నాని బేసిగ్గా డైరెక్షన్ డిపార్ట్ మెంటే కాబట్టి తనకు కూడా ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. ఇక ఆయనకి నాగార్జున తోడై, శ్రీరామ్ తో కూర్చుని అద్భుతమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నారు.

ప్రిస్టేజ్ గా ఫీలయ్యాం…

ఆ తరం నటీనటులతో మొదలైన వైజయంతీ సంస్థలో అలనాటి నటి ‘సావిత్రి’ కథ చెప్పగలగడం ప్రిస్టేజ్ గా ఫీలయ్యాం. అది ఇంత అద్భుతంగా సక్సెస్ అవ్వడం, ఇంత ఘనకీర్తి తెచ్చిపెట్టడం, గర్వంగా ఫీలవుతున్నాం.

నాగి డైరెక్షన్ లో…

డైరెక్టర్ నాగి డైరెక్షన్ లో భారీగా ఉండబోతుంది సినిమా. ఈ కథ ఒక స్టేజ్ లో చిరంజీవి గారికి సెట్ అవుతుందనిపించింది. కథ కంప్లీట్ అయ్యాకే   నాగి హీరో ఎవరనేది తెలుస్తుంది.

నెక్స్ట్ సినిమాలు…

డైరెక్టర్ అట్లీ తో జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా ఉంటుంది. NTR తో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో 2 సినిమాలు, విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీ రాజ్, D.K.  డైరెక్షన్ లో ఉంటుంది.

నెవర్…

ఇన్నాళ్ళ అనుభవంలో నాకెపుడూ కెమెరా ముందుకు రావాలని కానీ, డైరెక్షన్ చేయాలని కానీ అనిపించలేదు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బావుంటుంది.

తృప్తినిచ్చింది…

వైజయంతీ బ్యానర్ లో ‘దేవదాస్’ సినిమా 52 వ సినిమా. చాలా సంతృప్తికరమైన కరియర్ నాది.

స్వయం కృషికి…

స్వయంకృషి లేకపోతే ఏదీ చేయలేం. కానీ దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. అది లేకపోతే ఏం చేసినా వర్కవుట్ కాదు. ఇక్కడ ట్యాలెంట్ ఒక్కటే సరిపోదని నా పర్సనల్ ఫీలింగ్…

భారీ బడ్జెట్…

ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, స్టాండర్డ్స్ ని బట్టి సినిమాల్లో భారీ బడ్జెట్ తప్పడం లేదు. దానికి తోడు ఇప్పుడున్న మల్టీప్లెక్స్, డిజిటల్ రైట్స్, టి.వి. రైట్స్ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే, ఫిలిమ్ మేకింగ్ మరీ రిస్కీ కూడా కాదనిపిస్తుంది.

అది వాళ్ళు ఇచ్చిన గౌరవం…

మహేష్ బాబుని మా బ్యానర్ లో లాంచ్ చేయగలగడం కృష్ణ గారికి నాపై ఉన్న నమ్మకం. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ బ్యానర్ లోనే లాంచ్ చేసుకోవచ్చు, కానీ ఆ అవకాశం నాకిచ్చారు, NTR కి స్టూడెంట్ నం 1, రామ్ చరణ్ చిరుత, బన్ని గంగోత్రి.. ఇవన్నీ వాళ్ళు చేసుకోలేక కాదు, అనుభవం ఉన్న నిర్మాతగా వాళ్ళు నన్ను నమ్మడం వల్ల  జరిగింది. అది నా గొప్పతనం కాదు… మాకున్న అండర్ స్టాండింగ్. నారా రోహిత్ ని ఇంట్రడ్యూస్ చేసిన ‘బాణం’ సినిమా చాలా మంచి ప్రయత్నం. మంచి అవార్డులు వచ్చాయి ఆ సినిమాకి..

త్వరలో రిటైర్ మెంట్…

స్వప్న, ప్రియాంక తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే, ఇంకా ఇక్కడ నాకేం పని అనిపిస్తుంది. ఎంచక్కా బ్యాక్ సీట్లో రిలాక్స్ అయిపోవడం బెటర్ అని నా ఫీలింగ్. త్వరలో రిటైర్ మెంట్ ప్రకటిస్తా…