నభా నతేష్ లక్కీ అనిపించుకుంది...

Saturday,July 20,2019 - 11:02 by Z_CLU

పూరి సినిమాలో చాన్స్ దొరికితే చాలు హీరోయిన్స్ కి స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది. అలాపూరి సినిమా తరవాత కొన్నాళ్ళ పాటు తెలుగు సినిమాని రూల్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు నభా నతేష్ కూడా చేరిపోయింది.

అనుష్క : పూరి ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది. ఆ తరవాత ఏం జరిగిందన్నది హిస్టరీ… తెలుగు సినిమా హీరోయిన్స్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా, అనుష్క కి ప్రత్యేకంగా ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్థాయిలో సక్సెస్ అందుకుందీ పూరి హీరోయిన్…

ఇలియానా : ఇప్పుడు కాస్త వెనకబడింది కానీ… కొన్నాళ్ళ కిందట ఇలియానా సినిమాలో ఉందంటే ఆ సినిమా హిట్టే.. అన్న స్థాయిలో నిలబడింది. రామ్ ‘దేవదాస్’ తో సినిమాకి ఇంట్రడ్యూస్ అయినా ‘పోకిరి’ ఇలియానా కరియర్ లో ఎప్పటికీ స్పెషలే…

హన్సిక : ఈ మధ్య కొంచెం స్ట్రగుల్ పీరియడ్ ఫేస్ చేస్తుంది కానీ, ఒకప్పుడు టాప్ హీరోయినే. పూరి ‘దేశముదురు’ తరవాత కొన్నాళ్ళ పాటు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయేస్ట్ హీరోయిన్…

 

ఆసిన్ : పూరి ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తో ఇంట్రడ్యూస్ అయింది. ఆ తరవాత చాన్నాళ్ళ వరకు తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేసుకుని ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

ఈ వరసలో ఇప్పుడు నభా నతేష్ చేరింది. మరీ పూరి సినిమాతో ఇంట్రడ్యూస్ కాకపోయినా, కరియర్ బిగినింగ్ లోనే మాస్ హీరోయిన్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. నభా కరియర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు ఈ సినిమాకి తరవాత అనే కొత్త ఫేజ్ క్రియేట్ అయింది.