Nabha - సాయితేజ్ తో ప్రేమలో పడిందా?

Saturday,September 05,2020 - 12:32 by Z_CLU

లాక్ డౌన్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్న నభా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. సాయితేజ్ తో కలిసి సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూట్ కు ఎటెండ్ అయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో మాట్లాడిన నభా.. సినిమాలో సాయితేజ్ తనకు ప్రపోజ్ చేస్తాడా చేయడా అనే విషయాన్ని చెప్పనంటోంది.

పుస్తకాలు చదువుతున్నారా?
చాలా పుస్తకాలు చదువుతాను. హిస్టరీ, మైథాలజీ, బయోపిక్స్.. ఇలా చాలా రకాల పుస్తకాలు చదువుతాను.

పబ్ జీ అడతారా?
చాలా మంది ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు. నేను పబ్ జీ ఆడను.

సినిమాలో సాయితేజ్ మీతో ప్రేమలో పడతాడా?
సోలో బ్రతుకే సో బెటరు సినిమాకు సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఇది. నేనెందుకు చెబుతాను. సినిమా చూసి మీరే తెలుసుకోండి.

కాఫీ లేదా టీ?
మార్నింగ్ కాఫీ తాగుతాను.. మధ్యాహ్నం టీ

చికెన్ బిర్యానీ లేదా వెజ్ బిర్యానీ?
ఇదేం ప్రశ్న. అసలు వెజ్ తో చేసేది బిర్యానీనే కాదు. దాన్ని పులావ్ అంటారు. చికెన్, మటన్, ప్రాన్స్ తో చేస్తే దాన్ని బిర్యానీ అంటారు. నాకు చాలా ఇష్టం.

టాటూస్ ఏమైనా ఉన్నాయా?
ఇప్పటివరకు నా ఒంటిపై టాటూలు వేయించుకోలేదు. పెద్దగా రీజన్ ఏమీ లేదు. ఎలాంటి టాటూ వేయించుకోవాలో అర్థంకాక ఇప్పటివరకు వేయించుకోలేదు.

లాక్ డౌన్ లో చేసిన వంటకాలు
మీరు నమ్మరు కానీ లాక్ డౌన్ లో చాలా వంటలు చేశాను. సౌత్ నుంచి కాంటినెంటల్ వరకు ఎన్నో చేశాను. పిజ్జా, బర్గర్లు కూడా చేసుకొని తిన్నాను