నభా నతేష్ పై ‘ఇస్మార్ట్ శంకర్’ ఇంపాక్ట్

Thursday,September 12,2019 - 12:20 by Z_CLU

నభా నతేష్ కరియర్ టాపిక్ వస్తే ఖచ్చితంగా ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు.. తరవాత అని లెక్కేసుకోవాలి. ఈ సినిమా, ఈ బెంగళూర్ భామ కరియర్ పై క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మాస్ ఇస్మార్ట్ గర్ల్ గా నభా నతేష్ చేసిన పర్ఫామెన్స్ ఒక్కసారిగా ఫోకస్ లోకి తీసుకొచ్చేసింది. కట్ చేస్తే మెగా కాంపౌండ్ లో ఎంట్రీ దొరికింది. మెగా హీరో  సాయి ధరమ్ తేజ్ సరసన నటించనుంది నభా నతేష్.

ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ డెబ్యూ డైరెక్టర్ సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నభాని ఫిక్సయినట్టు తెలుస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లో మాస్ డైలాగ్స్ తో… గ్లామరస్ లుక్స్ తో అవకాశం దొరకాలి కానీ, ఎలాంటి రోల్ అయినా చేసేయగలదు అనిపించుకున్న నభా నతేష్, ఈ సినిమాలో కూడా డిఫెరెంట్ రోల్ లో కనిపించబోతుందట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ జెనెరేట్ చేస్తున్న ఈ టాక్, అఫీషియల్ గా కన్ఫమ్ అయితే, నభా సక్సెస్ ఫుల్ గా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టేసినట్టే అవుతుంది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.  BVSN ప్రసాద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.