
బుర్రకథ
నటీనటులు: ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి
ఇతర నటీనటులు : నైరా షా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, పథ్వీరాజ్, గాయత్రి గుప్తా, అభిమన్యుసింగ్ తదితరులు
సంగీతం : సాయికార్తీక్
రచన- దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
నిర్మాత: హెచ్.కె.శ్రీకాంత్ దీపాల
రిలీజ్ డేట్: జూన్ 28, 2019
అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలా, మరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్.
ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).
ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరు? ఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయింది? హీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుంది? అసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.
_____________________________________________________

రెడీ
నటీనటులు : రామ్, జెనీలియా
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 19 జూన్ 2008
రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
_______________________________________________

దేవదాస్
నటీనటులు : నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్
ఇతర నటీనటులు : R. శరత్ కుమార్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర, నరేష్, సత్య కృష్ణన్, మురళీ శర్మ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : శ్రీరామ్ ఆదిత్య
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018
దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.
మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్, దేవ కలిశారా లేదా..? విలన్లు, పోలీసులు ఏమయ్యారు? మధ్యలో రష్మిక, ఆకాంక్షల స్టోరీ ఏంటి? ఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.
_______________________________________________

నన్ను దోచుకుందువటే
నటీనటులు : సుధీర్ బాబు, నభా నతేష్
ఇతర నటీనటులు : నాజర్, రాజశేఖర్, వైవా హర్ష, చలపతి రావు, జీవ, బాబ్లో పృథ్విరాజ్, వర్షిణి సుందరాజన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీష్ లోక్ నాథ్
డైరెక్టర్ : R.S. నాయుడు
ప్రొడ్యూసర్ : సుధీర్ బాబు
రిలీజ్ డేట్ : 20 సెప్టెంబర్ 2018
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉంటాడు. ఉద్యోగులందరికీ అతడంటే హడల్. టార్గెట్లు పెట్టి హింసిస్తుంటాడు. అతడికి పనే ప్రపంచం. ఫ్యామిలీని కూడా పట్టించుకోని పనిరాక్షసుడు. ఎలాగైనా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి, ఆస్తులు పోగొట్టుకున్న తండ్రిని సుఖపెట్టాలనేది కార్తీక్ టార్గెట్.
ఇలాంటి వ్యక్తిని తన అల్లుడ్ని చేసుకోవాలని చూస్తాడు అతడి మేనమామ (రవివర్మ). కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని కార్తీక్ తో చెబుతుంది అతడి మరదలు. మరదల్ని సేవ్ చేయడం కోసం తను సిరి అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రి, మేనమామ దగ్గర అబద్ధం చెబుతాడు కార్తీక్.
ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చదువుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న మేఘన (నబా నటేష్) హెల్ప్ తీసుకుంటాడు. సిరి పేరుతో కార్తీక్ తండ్రికి (నాజర్) దగ్గరైన అల్లరి పిల్ల మేఘన నిజంగానే వాళ్లతో కలిసిపోతుంది. ఒక దశలో కార్తీక్ ను కూడా ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ప్రేమను అర్థం చేసుకోడు. చివరికి మేఘన ప్రేమను కార్తీక్ ఎలా గుర్తిస్తాడు? తండ్రిని ఎలా మెప్పించాడు? తను కోరుకున్న అమెరికా కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.
_______________________

అరవింద సమేత
నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్, నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018
కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.
అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.
__________________________________________

జెర్సీ
నటీనటులు : నాని, శ్రద్ధా దాస్
ఇతర నటీనటులు : సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కామ్ర, హరీష్ కళ్యాణ్, విశ్వనాథ్ దుద్దుంపూడి, సానుష
మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్
డైరెక్టర్ : గౌతమ్ తిన్ననూరి
ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగవంశి
రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019
అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.
అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.