అరవిందసమేత నుండి మరో సింగిల్

Tuesday,September 18,2018 - 12:45 by Z_CLU

రేపు సాయంత్రం 4: 50 నిమిషాలకు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనుంది NTR అరవింద సమేత టీమ్. రీసెంట్ గా ‘అనగనగా..’ అనే సాంగ్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, రేపు ‘పెనివిటి..’ అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

అనగనగా సాంగ్ కి తమన్ ట్యూన్స్ తో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ క్రియేట్ చేసిన క్రేజ్ నుండి ఫ్యాన్స్ ఇంకా బయటికి కూడా రాలేదు అప్పుడే సెకండ్ సింగిల్ రిలీజ్ అనగానే, ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్ మెంట్ పెరిగిపోయింది. రేపు ఈ సింగిల్ తో మరింత బజ్ క్రియేట్ చేయనున్న ‘అరవిందసమేత’ మేకర్స్, ఈ నెల 20 న కంప్లీట్ జ్యూక్ బాక్స్ రిలీజ్ చేయనున్నారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దసరాకి రిలీజవుతుంది.