రష్మిక తర్వాత స్థానం నభా నతేష్ దే

Friday,March 01,2019 - 11:02 by Z_CLU

ఎంత గొప్ప పర్ఫార్మర్ అయినా స్టార్ డమ్ ఒక్కసారిగా రాదు. అలా ఒకటీ అరా సినిమాలు చేసి గుర్తింపు  రాక ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ ఎందఱో ఉన్నారు. కానీ రష్మిక విషయంలో దీనికి ఆపోజిట్ జరిగింది. ఒక్క సినిమాతోనే ఫామ్ లోకి వచ్చేసింది. ‘ఛలో’ సినిమా క్రియేట్ చేసిన వైబ్స్, ‘గీతగోవిందం’ లో నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అక్కణ్ణించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు రష్మిక.

ఈ మధ్య కాలంలో  ఉన్నపళంగా  స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరా అంటే అది డెఫ్ఫినెట్ గా రష్మికనే. అయితే ఇప్పుడు అదే ప్లేస్ లో నభా నతేష్ పేరు కూడా చేరింది.  కొంచెం అటూ ఇటూగా, ఈ ఇద్దరి కరియర్ గ్రాఫ్  ఒక లాంటిదే. నభా నతేష్ కి ఇప్పుడున్నంత గుర్తింపు రావడానికి కూడా పెద్దగా టైమ్ పట్టలేదు. జస్ట్ ఒక్క సినిమాలో నటించిందో లేదో, సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన నభా నతేష్ ఇప్పుడు బిజీ హీరోయిన్.

 

నిజానికి వీళ్ళిద్దరికీ ఎగ్జాక్ట్ గా కలిసొచ్చింది ఎక్కడంటే, పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరకడం. రష్మిక ‘ఛలో’ సినిమాలో ఆల్మోస్ట్ అలాంటి రోల్ నే ప్లే చేసింది. ఇక నభా విషయానికి వస్తే ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో సుధీర్ బాబు రోల్ కన్నా, నభా ప్లే చేసిన రోల్ కే వైబ్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే నభా నతేష్ పర్ఫామెన్స్ కి  మంచి మార్కులు పడ్డాయి.

అలా ఫస్ట్ సినిమాతోనే ఎట్రాక్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ కొట్టేసిన లక్కీ హీరోయిన్స్ ప్లేస్ లో రష్మిక తర్వాత స్థానం నభా నతేష్ దే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, దిల్ రాజు – రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.