రష్మిక మందన్న – ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్

Saturday,July 27,2019 - 11:02 by Z_CLU

‘డియర్ కామ్రేడ్’ రష్మిక మందన్న కి జస్ట్ నాలుగో సినిమానే. కానీ ఎంతో అనుభవం ఉన్న నటిలా క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి నటించింది. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా తనే చెప్పుకోవడం ‘లిల్లీ’ క్యారెక్టర్ కి మరింత ప్రాణం పోసినట్టయింది. రష్మిక కోసమే దర్శకులు ఇలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారా..? లేకపోతే రష్మికకి న్యాచురల్ గానే కలిసొస్తుందా అనేది తెలీదు కానీ, ఈ కన్నడ బ్యూటీ ప్లే చేసిన ప్రతి క్యారెక్టర్ హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందే.

దేవదాస్ : ఈ సినిమా నిజానికి నాగార్జున, నానిలదే… సినిమాలో ఇద్దరేసి హీరోయిన్స్ ఉన్నా మూలకథ మాత్రం హీరోల చుట్టే తిరుగుతుంది. ఇలాంటి సినిమాలో కూడా ఇన్స్ పెక్టర్ పూజ అంటూ రష్మిక క్రియేట్ చేసిన వైబ్స్ ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యాయి.

గీత గోవిందం : ఇంకో పదేళ్ళకైనా ఈ ‘గీత’ కొత్తగానే అనిపిస్తుంది. అసలా క్యారెక్టర్ లో రష్మికను కాకుండా ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టమేమో. రెండో సినిమాకే ఆ స్థాయి క్యారెక్టర్ దొరకడం… సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం… రష్మికకి కలిసొచ్చింది.

 

ఛలో : రష్మిక తెలుగు సినిమాకి పరిచయం అయింది ఈ సినిమాతోనే… L. కార్తీక గా రష్మిక న్యాచురల్ పర్ఫామెన్స్  ఫస్ట్ సినిమాతోనే ఎస్టాబ్లిష్ అయింది. వచ్చీ రాగానే బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఫిలిమ్ మేకర్స్ దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు ఫస్ట్ చాయిస్ అనిపించుకుంటుంది.