రష్మిక ఏం నిర్ణయం తీసుకోనుంది..?

Friday,May 31,2019 - 10:02 by Z_CLU

ఏ ముహూర్తాన తెలుగు సినిమాకి పరిచయమైందో కానీ రష్మికకి అదృష్టం కన్ఫ్యూజ్ అయ్యే రేంజ్ లో పట్టేసుకుంది. నాగశౌర్య ‘ఛలో’ నుండి బిగిన్ అయితే గమనించే లోపు అల్లు అర్జున్, మహేష్ బాబు రేంజ్ స్టార్స్ పక్కన చాన్స్ కొట్టేసేవరకు ఎదిగిపోయింది. అయితే ఇప్పుడు అదే క్రేజ్ రష్మిక మండన్నను ఇరకాటంలో పడేసింది.

మహేష్ బాబు అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా ఫిక్సయింది రష్మిక మండన్న. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రావాల్సి ఉంది. అయితే మరోపక్క ఇదే టైమ్ పీరియడ్ లో సెట్స్ పైకి రానున్న విజయ్ కొత్త సినిమాలోను రష్మికకి ఆఫర్ దొరికింది. దీంతో రష్మిక ఈ 2 ఆఫర్స్ ని వదులుకోకుండా ఎలా మ్యానేజ్ చేయాలా..? అనే ఆలోచనలో పడింది.

ఇప్పటి వరకు తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు రష్మిక. ప్రస్తుతం కార్తీ కొత్త సినిమాతో సెట్స్ పై ఉంది. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సెకండ్ మూవీకే విజయ్ సరసన అంటే… ఇక కోలీవుడ్ లో కూడా రష్మికకి తిరుగుండదు. అలాగని ఇక్కడ మహేష్ బాబు సినిమాకి నో చెప్పగలదా..? అంత ఈజీ కాదు…

అందుకే అటు విజయ్.. ఇక్కడ మహేష్ బాబు 2 సినిమాల ఆఫర్ల మధ్య ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీక ఉక్కిరి బిక్కిరవుతుంది రష్మిక మండన్న. చూడాలి మరీ ఈ మలయాళీ బ్యూటీ తెలివిగా 2 సినిమాల్లో ఏదీ చేయి జారకుండా మ్యానేజ్ చేసుకుంటుందా..? లేక మహేష్ బాబు, విజయ్ ల మధ్య ఎవరో ఒకరినే ఎంచుకుంటుందా..? ఏ నిర్ణయం తీసుకుంటుందో..?