సాహోలో శ్రద్ధాకపూర్ క్యారెక్టర్ ఇదే ?

Friday,March 01,2019 - 03:33 by Z_CLU

ప్రభాస్ ‘సాహో ‘లో శ్రద్దా క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది…?

‘సాహో’ తో  తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఎలాంటి లుక్ లో కనిపించనుంది..?

ప్రస్తుతం ఫ్యాన్స్ లో రైజ్ అవుతున్న ప్రశ్నలివి. 

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ ‘సాహో’ లో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించబోతోందట బాలీవుడ్ బ్యూటీ. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో ప్రభాస్ కు హెల్ప్ చేసే క్యారెక్టర్ ప్లే చేస్తుందని తెలుస్తోంది. అంతే కాదు శ్రద్దా యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా కనిపిస్తుందట. ఇప్పుడు ఆ యాక్షన్ సన్నివేశాల్నే టీజర్ గా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ రిలీజ్ చేసిన సాహో టీం…. ఇప్పుడు శ్రద్దా కపూర్ బర్త్ డే సందర్భంగా మార్చ్ 3న ‘షేడ్స్ ఆఫ్ సాహో 2 ‘పేరుతో శ్రద్దా క్యారెక్టర్ కి సంబంధించి టీజర్ ను విడుదల చేస్తున్నారు. యూ.వీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ 15 న థియేటర్స్ లోకి రానుంది.