ఈ ఇయర్ నాదే అంటున్న రష్మిక

Tuesday,January 07,2020 - 01:48 by Z_CLU

‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ బాబు సరసన నటించింది రష్మిక. దానికి తోడు ఈ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా కాస్తంత కామిక్ డోస్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్ లో నవ్వించనుంది రష్మిక. అయితే ‘సరిలేరు…’ రిలీజ్ తరవాత ఇమ్మీడియట్ గా ఫిబ్రవరిలోనే ‘భీష్మ’ లో మరో డిఫెరెంట్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనుంది ఈ హీరోయిన్.

మహేష్ బాబు సినిమాతో ఇయర్ స్టార్ట్ అయితే.. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ‘భీష్మ’ రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పుకున్న రష్మిక, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ ఏడాది బిగినింగ్ నాదే అంటూ సంబరపడిపోతూ చెప్పుకుంది.

కథలతో పాటు అందులో తన క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నానని చెప్పుకున్న రష్మిక ‘సరిలేరు…’ లో క్యారెక్టర్ తన కరియర్ లోనే ఓ ప్రయోగం లాంటిదని, ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది.