హీరోయిన్ హన్సిక ప్లాన్ ‘బి’

Friday,March 01,2019 - 10:02 by Z_CLU

ఒకప్పుడు ఫ్యాన్స్ కి ఫేవరేట్ హీరోయిన్. ఒక సినిమాలో హన్సిక ఉందంటే ఆల్మోస్ట్ సినిమా సూపర్ హిట్టే. కొన్నాళ్ళ పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ప్లేస్ లో ఉంది. ఆల్మోస్ట్ అందరూ టాప్ హీరోల సరసన నటించేసిందీ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు టైమ్ మారింది.

హన్సికకి ఇప్పుడు తమిళంలోనూ అటు తెలుగులోనూ పెద్దగా ఆఫర్స్ లేవు. ఎప్పుడో 2017 లో ‘గౌతమ్ నంద’ సినిమాలో గోపీచంద్ సరసన నటించిన హన్సిక, మళ్ళీ హీరోయిన్ గా చాన్స్ దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా ‘NTR కథానాయకుడు’ లో జయప్రద గా కనిపించినా, పెద్దగా వైబ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు.

అందుకే హన్సిక ప్లాన్ ‘బి’ అమలు చేస్తుంది. స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ, మళ్ళీ యంగ్ హీరోస్ తో కూడా జత కట్టేస్తుంది. రీసెంట్ గా సందీప్ కిషన్ తో కలిసి ‘తెనాలి రామకృష్ణ BA BL’ సెట్స్ పైకి వచ్చేసింది.

దీంతో యంగ్ హీరోస్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న ఫిల్మ్ మేకర్స్ దృష్టి హన్సిక పై నిలుస్తుంది. మరి ఈ ‘తెనాలి రామకృష్ణ BA BL’ హన్సిక కి మరిన్ని ఆఫర్స్ తీసుకొచ్చి పెడుతుందా..? హన్సిక ప్లాన్ B వర్కవుట్ అయి, యంగ్ హీరోస్ తో జతకట్టి, కరియర్ స్పీడ్ పెంచాలనుకుంటున్న హన్సికకి, మళ్ళీ టాప్ స్టార్స్ సరసన నటించే స్థాయి వస్తుందా..? అనేది చూడాలి.