Virupaksha - విరూపాక్ష టీజర్ రివ్యూ

Friday,March 03,2023 - 03:31 by Z_CLU

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. పవన్ కళ్యాణ్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసి, ప్రత్యేకంగా యూనిట్ ను మెచ్చుకున్నాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి తాజాగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్, ఒక గ్రామంలో జరిగే వింత సంఘటనల చుట్టూ కథ తిరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని గ్రామ పెద్ద వివరిస్తుండగా, హీరో గ్రామంలోకి ప్రవేశిస్తాడు.

గుర్తుతెలియని వ్యక్తితో సాయి తేజ్ ఫైట్ చేయడం, పంచ్ డైలాగ్స్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. ఆధ్యాత్మికత, మూఢ నమ్మకాల మధ్య ఈ కథ సాగుతుందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది.

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. సుకుమార్ స్క్రీన్ ప్లే రాశారు. రోడ్డు యాక్సిడెంట్ కు గురై, కోలుకున్న తర్వాత సాయితేజ్ నుంచి వస్తున్న సినిమా ఇదే.