#SSMB29 మార్చిలో ముహూర్తం ?

Tuesday,January 31,2023 - 12:59 by Z_CLU

Mahesh Babu Rajamouli’s #SSMB29 Muhurtham details

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో కె ఎల్ నారాయణ నిర్మించనున్న భారీ బడ్జెట్ మూవీకి సంబందించి ఓ అప్ డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాను మార్చ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది. ఇంకా మేకర్స్ ఆఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ , మార్చ్ లో ఓ డేట్ లాక్ చేసుకున్నటు సమాచారం.

ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి రాజమౌళి స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో ఓ ఎడ్వంచరస్ యాక్షన్ మూవీ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఆ పాయింట్ మీద స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మార్చ్ లో మంచి ముహూర్తం కారణం చేత సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి కొన్ని నెలల తర్వాత షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics